Thursday, February 13, 2014

ఈ మహా యజ్ఞంలో ....!!

స్పందించే  మనసు ఉంటే  సాయం అందించే చేతులు తప్పక చేయూతనిస్తాయని మరోసారి ఋజువు అయింది... మా సంస్థ అందించిన చిరు సాయానికి ఆ పాపాయికి అందిన సాయం .... ఎందరో మనసున్న మానవీయతా మూర్తులు వారి మనసులు అందించిన ఆపన్న హస్తాలు...వారిలో మాకు అండగా నిలిచి మాతో  పాటుగా ఆ పాపకు 5000 రూపాయలు అందించిన యశోదా రెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు .... సాయాన్ని అందించిన అందరికి మా మనఃపూర్వక వందనాలు... ఈ మహా యజ్ఞంలో మేము చిరు సమిధలమైనందుకు మాకు ఆనందం....